నస్పూర్, అక్టోబరు 21 : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమన్వయంతో పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చెన్నూరు, మందమర్రి, జన్నారం, లక్షెట్టిపేట, మంచిర్యాల, దండేపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందించారు. మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజావాణిలో 21 దరఖాస్తులు వచ్చాయన్నారు.
సమస్యలు సత్వరమే పరిషరించాలి
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, అక్టోబర్ 21 : ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.