సమస్యల పరిషారానికి కృషి
ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12 : ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన ఉప్పరి విజయలక్ష్మి, ఉప్పరి తిరుపతి, బర్ల బానక, ఆసిఫాబాద్కు చెందిన బాబురావు, డిగ్రీ విద్యార్థి కొండ్ర తిరుపతి ఉపాధి కల్పించాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తులు అందజేశారు.
రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మాదాసు కిష్టయ్య తన తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిని తమ పెద్ద అన్న పేరిట నమోదు చేశారని, దీన్ని సవరించి ముగ్గురు అన్నదమ్ములకు సమానంగా పంచాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. ప్రజావాణి కార్యక్రమానికి అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిషరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

