నిర్మల్ అర్బన్, నవంబర్ 6 : గ్రూప్-3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 17,18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారుల కు సూచించారు.
జిల్లా కేంద్రంలో 24 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8,124 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో రవీందర్రెడ్డి, పరీక్షల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి గంగారెడ్డి, డీఎంహెచ్వో రాజేందర్, కమిషనర్ ఖమర్ అహ్మద్, డీఎం ప్రతిమారెడ్డి పాల్గొన్నారు.
గర్భస్థ మహిళా మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భం దాల్చిన వెంటనే మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి హైరిస్క్ గర్భిణులను గుర్తించాలన్నారు. ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులలో హృద్రోగ నిర్ధారణ కోసం టుడీఇకో నిర్వహించేందుకు సామగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. డీఎంహెచ్వో రాజేందర్, వైద్యాధికారులు శ్రీనివాస్, సురేశ్, సౌమ్య, సరోజ, నయనారెడ్డి పాల్గొన్నారు.