కేంద్రం వ్యవసాయంపై ఆంక్షలు విధిస్తుంటే.. కేసీఆర్ సర్కారు పండుగలా మారుస్తున్నది. మోదీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ, నూతన చట్టాలతో అడ్డుపడుతుంటే తెలంగాణ సర్కారు రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఫలితంగా బీడు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. ఎటు చూసినా జలం, పైరు పచ్చదనమే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ధాన్యం కొనడానికి ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పుట్లకొద్దీ ధాన్యాన్ని డీఆర్డీఏ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా సేకరించింది. మద్దతు ధరతో కొనుగోలు చేసి 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ వానకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3,26,368 ఎకరాల్లో వరి సాగైంది. 468 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 31,454 మంది రైతుల నుంచి 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందుకోసం అక్షరాల రూ.632 కోట్లు ఖర్చు చేసింది. ధాన్యం, రైతుబంధు డబ్బులు రావడంతో యాసంగి పెట్టుబడికి ఢోకా లేకుండా పోయిందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్/మంచిర్యాల అర్బన్/నిర్మల్ టౌన్, జనవరి 12 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలం ధాన్యం కొనుగోళ్లు కొన్ని జిల్లాల్లో పూర్తి కాగా.. మరికొన్ని జిల్లాల్లో తుది దశకు చేరుకున్నా యి. డీఆర్డీఏ(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ స హకార సంఘాలు(పీఏసీఎస్), డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ద్వారా ధాన్యం సేకరించారు. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని కేంద్రాల్లో ఇబ్బందుల్లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా, లారీల సమస్య తలెత్తకుండా ప ర్యవేక్షించారు. ఏ మిల్లు వద్ద లారీలు నిలువకుం డా పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. తేమ శాతం ఆధారంగా ధా న్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించారు. తేమపై విస్తృతంగా అవగాహన పెంచడంతో జా ప్యం జరగలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏ రో జుకారోజు తూకం వేసి రైస్‌మిల్లర్లకు పంపించడమే కాకుండా ట్రక్షీట్లను ఆన్లైన్లో నమోదు చేశా రు. గతేడాది క్వింటాలు గ్రేడ్ ఏ ధా న్యానికి రూ. 1,960, సాధారణ రకానికి రూ.1,940 చెల్లించగా.. ప్రభుత్వం రూ.100 పెం చి ఈ యేడాది గ్రేడ్ ఏ కు రూ.2,060, సాధారణ రకానికి రూ. 2,040 చెల్లించింది. అది కూడా కొనుగోలు చేసిన 24 గంటల్లో నే రైతు ఖా తాల్లోకి నేరుగా డబ్బులు జమ చేశారు. కాగా.. అటు రైతుబంధు డబ్బులు జమవడం.. ఇటు ధాన్యం డబ్బు లు కూ డా రైతుల ఖాతాల్లో పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన డబ్బులు కూడా వారంలోపు జమకానున్నాయి. పౌర సరఫరాలు, రవాణ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించడంలో కొనుగోళ్లు పూర్తయ్యాయి.
జిల్లావ్యాప్తంగా వానకాలంలో 1,57,588 ఎకరాల్లో వరి సాగైంది. ధాన్యాన్ని సేకరించడానికి 244 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇం దులో డీఆర్డీఏ(ఐకేపీ), పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏజెన్సీల ద్వారా ధాన్యం సేకరించారు. డీఆర్డీఏ పరిధిలో 54 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4,918 మంది రైతుల వద్ద నుంచి రూ.54.16 కోట్ల విలువైన 26,294 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. పీఏసీఎస్ పరిధిలో 119 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10,894 మంది రైతుల వద్ద నుంచి రూ.124.93 కోట్ల విలువైన 60,649 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. డీసీఎంఎస్ పరిధిలో 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 9,593 మంది రైతుల వద్ద నుంచి రూ.136. 46 కోట్ల విలువైన 66,246 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని సేకరించారు. గతేడాది వానకాలంలో రైతుల నుంచి 1,37,179 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ యేడాది 1,53,190 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈ లెక్కన 16,010 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొన్నారు. రైతుల వద్ద నుంచి రూ.315.57 కోట్ల విలువైన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు రూ.205.90 కోట్లు 21, 921 మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
జిల్లావ్యాప్తంగా 1.10 లక్షల ఎకరాల్లో వరి సా గైంది. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 1,36,934 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 209 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. 200 కేంద్రా ల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. ఇందులో 194 కేంద్రాల్లో ఇప్పటివరకు 3,393 మంది రైతుల నుంచి ధాన్యం కొన్నారు. ధాన్యానికి రూ.271.95 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
జిల్లాలో 58,780 ఎకరాల్లో వరి సాగైంది. ధాన్యం సేకరణకు 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందు లో డీఆర్డీఏ(ఐకేపీ) 5, పీఏసీఎస్ 25 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు 2,652 మంది రైతుల నుంచి 21,577 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా. రూ.44.48 కోట్లను ఖాతాల్లో జమ చేశారు.
ఇరవై ఏండ్ల సంది ఎవుసం జేత్తన్న. నాకు నాలుగెకరాల భూమి ఉంది. రెండున్నరెకరాల్లో మక్క, ఎకరంన్నరలో వరి ఏసిన. 35 క్వింటాళ్ల వడ్లచ్చినయ్. తెలంగాణ సర్కారు మా ఊళ్లోనే కొన్నది. అమ్మగా రూ.72,100 పైసలు అచ్చినయ్. 24 గంటల్లోనే డబ్బులు ఖాతాలో పడ్డయ్. మూడు రోజుల క్రితం రూ.20 వేలు రైతుబంధు డబ్బులు కూడా జమ చేసింది. ఈ అన్ని పైసలు పెట్టుబడి కింద కూలీలొళ్లకు, ఎరువులు, విత్తనాలకు కొనుగోలుకు వాడుకుంటా. ఎవ్వరి దగ్గరకు పోవాల్సిన పనిలేకుండా సీఎం కేసీఆర్ సారూ జేసిండు. కేసీఆర్ సీఎం అయితేనే గిట్ల ఉంటే.. ప్రధాని అయితే దేశంలోని రైతులు బాగు పడుతరు. అయన ప్రధాని కావాలె.
– చాక్పెల్లి జలన్న, వెంకూర్, కుంటాల మండలం, నిర్మల్ జిల్లా