పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని ఎల్డీఎం ప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్‌లో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు నిర్వహించారు.
ఎదులాపురం, అక్టోబర్ 1 : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని ఎల్డీఎం ప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్‌లో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఆర్ఎం శ్రీనివాస్, టీజీబీ ఆర్ఎం రమణారెడ్డి, ఏజీఎం రాహుల్, మేనేజర్లు శ్రీధర్, ఇండాల్, సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో ..
జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో పరిసరాలు పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాధ, ఏఎల్ఎంఎస్ సభ్యులు రబ్బాని, రషీదా, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్ ఆధ్వర్యంలో..
స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా రిమ్స్ ఆవరణలోడైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, డీఎంవో మెట్‌పెల్లి శ్రీధర్, సిబ్బందితో కలిసి పరిసరాల్లో పిచ్చిమొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో రెండు రోజుల పాటు డ్రైడేను నిర్వహించాలని సూచించారు. నిల్వ నీటితో దోమలు వ్యాపించి డెంగీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
సఖీ కేంద్రం ఆధ్వర్యంలో..
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలోని సఖీ కేంద్రం ఆవరణలో పరిసరాలు శుభ్రం చేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో సఖీ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో సిబ్బంది లావణ్య, నాగమణి పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
ఇచ్చోడ, అక్టోబర్ 1 : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో రాంప్రసాద్ అన్నారు. ఆదివారం స్వచ్ఛతా హీ సేవా-2023 చెత్త రహిత భారతదేశం శ్రమదానం (ఏక్ తారీఖ్.. ఏక్ ఘంటా.. ఏక్ సాథ్)లో భాగంగా ఇచ్చోడలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఐకేపీ మహిళలు ర్యాలీ తీసి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేసి, శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, సర్పంచ్ సునీత, ఉపసర్పంచ్ శిరీష్ రెడ్డి, ఎంపీవో రమేశ్, ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్, ఏపీవో నరేందర్, పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

