ఆసిఫాబాద్, మార్చి 7 : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ధర్నా చేశారు.
కార్మికుల వేతనాలు, కోడిగుడ్లు, టిఫిన్స్ బిల్లులను వెంటనే ఇవ్వాలని, రూ. 10 వేల వేతనం అమల్లోకి తీసుకురావాలని కోరారు. కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సత్వరమే స్పందించి ఆదుకోవాలని విజ్ఙప్తి చేశారు. మధ్మాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు కే శారద, గౌరవ అధ్యక్షుడు వెలిశాల క్రిష్ణమాచారి, కార్యదర్శి పీ మాయ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఉన్నారు.