నార్నూర్ : సీఐటీయూ( CITU ) రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జయలక్ష్మి ( Jayalakshmi ) పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పంచాయతీ ప్రాంగణంలో అంగన్వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈనెల 25, 26వ తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఈ ఆర్ సింధు, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు, ఉపాధ్యక్షులు ఎస్ వరలక్ష్మి, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ హాజరుకానున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు,వివిధ రంగాల్లో పనిచేస్తున్న సీఐటీయూ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభల్లో భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై, ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలపై చర్చ ఉంటుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు కే సునీత, సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి బొజ్జ ఆశన్న, మొల్ల కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్, వెంకటమ్మ, పంచశీల, పంచ పూల, మల్లు, కవిత, చంచల, సంగీత తదితరులు పాల్గొన్నారు.