నార్నూర్, ఆగస్టు 18 : వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని నార్నూర్ సీఐ పేందోర్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని రాజుల్ గూడ ఫంక్షన్ భవనంలో పీస్ ఫుల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన సూచించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండప నిర్వహకులు చూడాలన్నారు.
పలు అంశాలపై అవగాహన కల్పించారు. వినాయకుని ప్రతిష్టాపించే నిర్వాహకులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఏవైనా సంఘటనలు చోటు చేసుకుంటే తక్షణమే 100 డయల్‌కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ ఎస్సై అఖిల్, మాజీ సర్పంచ్ బానోత్ గజానన్ నాయక్, రాయి సెంటర్ జిల్లా సార్ మేడి మేస్రం దుర్గుపటేల్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ రెడ్డి నాయక్, మండపాల నిర్వాహకులు ఉన్నారు.