సారంగాపూర్, ఫిబ్రవరి 19: బడిబయటి పిల్లలతోపాటు అర్ధాంతరంగా చదువుమానేసిన వారిని గుర్తించేందుకు సర్కారు ఓఎస్సీ(అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) పేరిట నిర్వహించిన సర్వే పూర్తయింది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంతోపాటు మళ్లీ వారిని బడికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. గత జనవరి 6-18వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగగా.. విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఆర్పీలు సర్వే కూడా నిర్వహించారు. యేటా 6 నుంచి 14 ఏండ్లలోపు చిన్నారులను మాత్రమే గుర్తించేవారు. ఈ యేడాది ప్రత్యేకంగా 15-19 ఏండ్లలోపు వయస్సు కలిగి, ఉన్నత విద్య ఆపేసిన వారిని కూడా ఐడెంటిఫై చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 6-14 ఏండ్ల లోపు బాలబాలికలు 557, 15-19 ఏండ్ల లోపు వారు 387 మంది, వలస పిల్లలు 28 మంది మొత్తం 972 మందిని గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపేట్లు ప్రోత్సహించాలని, అప్పుడే చదువులో శ్రద్ధ చూపి ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతారని అధికారులు పేర్కొంటున్నారు.
బడిబయటి పిల్లలతో పాటు మ ధ్యలోనే చదువు మానేసిన పిల్లలను గుర్తించేందుకు చేపట్టిన స ర్వే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగిసింది. బాలకార్మిక వ్య వస్థను నిర్మూలించడంతో పాటు వారిని మళ్లీ బడికి పం పేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆయా జి ల్లాల విద్యాశాఖ అధికారులు గ్రామాల్లో తిరిగి బడిబయటి పి ల్లలను గుర్తించారు. ఈ మేరకు ఓఎస్సీ (అవుట్ ఆఫ్ స్కూల్ చిల్రన్) సర్వేను నిర్వహించారు. గతనెల (జనవరి) 6వ తేదీ నుంచి 18తేదీ వరకు సీఆర్పీలు సర్వే చేశారు. ప్రతి ఏటా 6 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న బడిబయటి పిల్లలను మాత్రమే గు ర్తించేవారు. కానీ ఈ ఏడాది ప్రత్యేకంగా 15 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు కలిగి, ఉన్నత విద్య ఆపేసిన వారిని కూడా గుర్తించారు. అయితే ఈ సర్వే ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాప్తంగా 972 మంది బడిబయటి పిల్లలు ఉన్నారు. వి వరాలను ప్రబంధ్ పోర్టల్ యాప్లో పిల్లల పూర్తి వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపారు.
సర్వేలో చేపట్టిన అంశాలు..
పాఠశాలల్లో చేరాల్సిన వయస్సులో వీధుల్లో ఉంటున్న పిల్లల వివరాలను రెండు గ్రూపులుగా వర్గీకరించారు. వీరిలో పదో త రగతి వరకు ఆరేండ్ల నుంచి 14 ఏళ్లలోపు, అలాగే ఇంటర్మీడి యట్ వరకు 15 ఏండ్ల నుంచి 19 ఏండ్ల లోపు బాలబాలికల వివరాలను గ్రామాల్లో తిరిగి సేకరించారు. సగం మందికి పైగా పిల్లలను ఇది వరకే ఆయా జిల్లాలలోని విద్యాసంస్థల్లో వయ స్సు ఆధారంగా అధికారులు చేర్పించగా, మిగతా పిల్లలను వ చ్చే విద్యాసంవత్సరంలో కచ్చితంగా చేర్పిస్తారు. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో 6నుంచి 14 ఏళ్లలోపు వయస్సు కలిగిన 557 మంది బాలబాలికలు , 15 నుంచి 19 ఏళ్ల వయస్సు కలి గిన 387 మంది బాలబాలికలు, 28 మంది మైగ్రేట్స్ మొత్తం 972 మందిని గుర్తించారు.
బడిబయట పిల్లల కోసం చేపట్టిన చర్యలు..
బడిబయటి పిల్లలను గుర్తించిన అనంతరం వారి తల్లిదం డ్రు లకు కౌన్సెలింగ్ ఇచ్చి అందుబాటులో ఉండే పాఠశాలల్లో చేర్చా రు. ఇవేకుండా అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్స్ (యూఆర్ఎస్) ను ఏర్పాటు చేసి బాలికలు, బాలురకు సపరేట్గా వీటిని ప్రా రంభించి విద్యను అభ్యసిస్తున్నారు. వీటితోపాటు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ (ఎస్టీసీ) ద్వారా అక్కడే శిక్షణను ఏర్పాటు చేసి బడిబయటి పిల్లలకు విద్యనందిస్తారు. ఓఎస్సీ సర్వేలో మై గ్రేట్స్ (వలస) వెళ్లిన వారి కోసం రెసిడెన్షియల్ స్కూల్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్ఎస్టీసీ) లను ఏర్పాటు చేసి విద్యనందిచడం, ఈ నాలుగు పద్ధతుల ద్వారా బడిబయటి పిల్లలకు విద్యను అందిం చేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇవేకాక ఇటుక బట్టీలు, కర్మాగారాల వద్ద పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం వర్క్ సైట్ స్కూళ్లు ఏర్పాటు చేసి అక్కడే విద్యనందించేందుకు యాజమాన్యాల సహకారంతో 14 ఏళ్ల లోపు విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు.
295 మందిని గుర్తించాం..
ఆదిలాబాద్ జిల్లాలో 295 మంది బడిబయట పిల్లలను గుర్తిం చాం. వారంతా పాఠశాలల్లో చేరేలా చ ర్యలు తీసుకుంటున్నాం. గ్రామా ల్లో ఉన్న పెద్దలందరూ పట్టించు కొని భాగస్వాములైన ప్పుడే బడి బయట ఉండే అవకాశం ఉండదు. ప్రతి రోజు పిల్లలు బడికి రావడం మూలంగా ఉపాధ్యాయులు బోధించే పాఠాలు అర్థం అవ్వడమే కాకుండా గుణాత్మక విద్య అందుతుంది. అలాగే ఉ న్నత విద్యాభ్యాసానికి అవకాశం ఉంటుంది. తల్లి దండ్రులు కూడా పిల్లలను బడికి వెళ్లేలా ప్రోత్సహించాలి. అ ప్పుడే చ దువులో శ్రద్ధ చూపి వారు ప్రయోజకులవుతారు.
–కంటె నర్సయ్య, క్వాలిటీ కో-ఆర్డినేటర్, ఆదిలాబాద్