తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఐలమ్మ
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సమసమాజ అభివృద్ధికి, కులమతాలకు అతీతంగా అందరూ పాటుపడాలని ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రయ్య, మునిమనుమడు సంపత్ అన్నారు.
- ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రయ్య
- కొరిటికల్‌లో విగ్రహాఆవిష్కరణ
మామడ, సెప్టెంబర్24 : పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సమసమాజ అభివృద్ధికి, కులమతాలకు అతీతంగా అందరూ పాటుపడాలని ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రయ్య, మునిమనుమడు సంపత్ అన్నారు. మండలంలోని కొరిటికల్ గ్రామంలో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఐలమ్మకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఐలమ్మదేనని పేర్కొన్నారు.
ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సర్పంచ్ భోజవ్వ, ఎంపీటీసీ అందె సౌజన్య, ఉప సర్పంచ్ కొండ్ర శిరీష, ఐలమ్మ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట పోశెట్టి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యక్షుడు సహదేవ్, మామడ మండలాధ్యక్షుడు ఏటి రాజేశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్డర్ నల్ల లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, పల్లి రాజేశ్వర్, రమేశ్‌రెడ్డి, రత్నయ్య, రాజేశ్వర్, అశోక్, శ్రీనివాస్, లింగం, రాజన్న తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

