బెల్లంపల్లి : జేఈఈ అడ్వాన్స్ (JEE Advance) పరీక్ష ఫలితాలలో బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సి (Bellampalli) కి చెందిన విద్యార్థులు మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ ( Vijayasagar ) తెలిపారు. ఐఐటీ ర్యాంకులలో షేక్ సుభాన్ (Shaik Suban) ఆల్ ఇండియా ర్యాంక్ 32,278, ఎస్సీ కేటగిరీ విభాగంలో ఎస్.ఆదర్శ్ 3,285 (Adarsh) , కె.రంజిత్ 3,438, జి. చరణ్ 4,346, డి. రాజేందర్ 5,414 ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రిపరేటరీ ర్యాంకుల్లో కె. రామ్ చరణ్ 296, సిహెచ్ సాయికుమార్ 311, ఎస్ వెంకటేష్ 1,952, బి అంజిబాబు 4790 ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ర్యాంకులను సాధించిన విద్యార్థులను ఎంజెడ్వో అలివేలు మొబైల్ ద్వారా విద్యార్థులకు అభినంధనలు తెలుపారు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు ప్రత్యేకంగా విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.