తిర్యాణి/వాంకిడి/ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జులై 16 :జూలై 16: ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర రోడ్డు, రవాణా,రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం సుంగాపూర్‌లో శాట్‌లైట్ సెంటర్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన్మన్ పథకం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హాజరయ్యారు. పీవీటీజీల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం ఖైరిగూడాలో ఓసీపీని పరిశీలించారు.వాంకిడిలోని పీహెచ్‌సీని సందర్శించి రోగులతో మాట్లాడారు. లింబుగూడలో రూ.60 లక్షలతో బహుళార్థక ప్రయోజన కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, కంప్యూటర్ తరగతిగది, పంచాయతీ కార్యదర్శి గదిని ఆయన పరిశీలించారు. ఆసిఫాబాద్‌లోని జనకాపూర్‌లో ఈ పథకం కింద 19 లక్షల రూపాయలతో నిర్మించిన ఆదర్శ అంగన్వాడీ కేంద్రం, సంచార సైన్స్ ప్రయోగశాల, ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సెంటర్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రత్యేకంగా ని ధులు కేటాయించాలని, ఏకలవ్య మో డల్ సూల్ను మంజూరు చేయాలని కేంద్ర సహాయ మంత్రి హ ర్ష్ మల్హోత్రాకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి వినతి పత్రం అందించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.