నార్నూర్ : వలస వచ్చిన లంబాడీలపై (Migrant Lambadis) విచారణ చేపట్టి కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు( Caste certificates Cancel ) చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సెడ్మాకి రామారావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ శ్యాం సుందర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 తర్వాత వలస వచ్చిన లంబాడీలపై విచారణ చేపట్టి కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరారు. లంబాడి తెగకు చెందిన కొందరు వ్యక్తులు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారు సాగు చేసే భూములకు పట్టాలు చేసుకున్నారని ఆరోపించారు.
జిల్లాలోని లంబాడిగాకు చెందిన కుటుంబాలు విచ్చలవిడిగా వలస వచ్చి ఆదివాసుల రిజర్వేషన్, భూములను, ఉద్యోగులను దోచుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు భీంరావు, ప్రచార కార్యదర్శి మడవి నటరాజ్, ఉపాధ్యక్షులు జైతు, ప్రధాన కార్యదర్శి ఆర్క గోవింద్, సంతోష్, వినోద్ కుమార్, సోనేరావు, కేశ రావు తదితరులున్నారు.