తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి మండలి సోమవారం సమావేశమై కీలక నిర్ణయాలపై చర్చించారు. అసెంబీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుండగా.. ఇక, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏమవుతుందని ఆశ పడ్డామో.. ఈ రోజు అది నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– మంచిర్యాల, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఎంత కష్టపడినా లాభాల్లోకి తేలేకపోతున్నాం. అప్పులు ప్రభుత్వానికి భారమవుతున్నాయ్. ప్రైవేటీకరిస్తే పనైపోతుంది. ఇది ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాల ప్రకటనలు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, టీడీపీ పార్టీ ఉన్నా ఎ టుచేసి ఆర్టీసీని ఆగం చేయాలనే కుట్రలే తప్ప.. బాగు చే యాలని ఎవరూ ఆలోచించలే. కానీ.. తెలంగాణ వ చ్చా క సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా సకల జనుల స మ్మె లో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. తెలంగా ణ ప్రభుత్వం కచ్చితంగా ఆర్టీసీని కాపాడుకుంటుంది. కా ర్మికులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటుంది. అని ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడానికి సోమవారం మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నా రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండ్ల నాటి డిమాండ్‌ను నెరవేర్చి, మా బతుకులకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటున్నారు. తెలంగాణ వస్తే ఏమవుతుందని ఆశ పడ్డామో ఈ రోజు అది నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై ఉద్యోగుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.
శుభ పరిణామం
ఆర్టీసీ కార్మికుల కష్టం ఏందో సీఎం కేసీ ఆర్కు తెలుసు. అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మి కుల డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీను నిలబె ట్టుకున్నాడు. ప్రభుత్వంలో విలీనం చేస్తామనడం శుభ పరిణామం. కొంత ఆలస్యమైనా మంచి నిర్ణయం. ఆర్టీసీ చరిత్రలోనే ఇది సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు.
– ఏఎం ఖాన్, ఆర్టీసీ డ్రైవర్, మంచిర్యాల.
ఆర్టీసీని ఆదుకున్న కేసీఆర్
నిర్మల్ అర్బన్, జూలై 31: ప్రత్యేక రా ష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు ఆ ర్టీసీ ఆధ్వర్యంలో సంఘీబావం తెలిపి రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేసిన పోరాటాన్ని సీఎం గుర్తించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్ర త్యేక బడ్జెట్‌ను కేటాయించి ఆదుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కా ర్మికుల కష్టాలను గుర్తించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆర్టీసీని పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ ఉద్యోగు లకు అండగా నిలుస్తున్నరు.
-మారుగొండ రాము, టీఎంయూ జిల్లా గౌరవాధ్యక్షుడు
ఇక అందరూ సర్కారు ఉద్యోగులే..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ డం చాలా సంతోషంగా ఉంది. ప్రభు త్వ నిర్ణయంలో కార్మికులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కనుంది. సీ ఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో అ న్ని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చే స్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో స మానంగా అందరికీ ఒకేసారి వేతనాలు రానున్నాయి. సీఎం కేసీఆ ర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-గంగాధర్, టీఎంయూ నిర్మల్ జిల్లా కార్యదర్శి