కౌటాల, డిసెంబర్ 6 : సిర్పూర్(టీ) మండలం చీలపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం పులి దాడిలో ఓ గేదె మృతి చెందింది. బాధితుడు జెల్ల నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం పశువుల కాపరి జెల్ల సాయి గేదెలను తోలుకొని స్థానిక అటవీప్రాంతానికి వెళ్లాడు.
మధ్యాహ్నం పులి ఒక్కసారిగా గేదెల మందపై దాడి చేసింది. గమనించిన సాయి పెద్దగా కేకలు వేస్తూ సమీపంలోని చెట్టుపైకి ఎక్కాడు. చుట్టు పక్కల ఉన్న రైతులు, కూలీలు కేకలు వేస్తూ అక్కడికి చేరుకోవడంతో పులి వెళ్లిపోయింది. పులి దాడిలో ఓ గేదె చనిపోగా, మరో రెండింటికి గాయాలయ్యాయి.