కోటపల్లి/రామకృష్ణాపూర్/మందమర్రి/చెన్నూర్ రూరల్/సీసీసీ నస్పూర్/బెజ్జూర్, మార్చి 22 : విద్య రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శనివారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా చోట్ల విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
కోటపల్లి మండలం రాంపూర్‌కు వెళ్లి బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్‌తో పాటు, నాయకులు గుగ్లోత్ బాపు నా యక్, ఆసంపల్లి అనిల్, కొట్టె వెంకటేశ్‌ను పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే క్యాతనపల్లి మున్సిపాలిటీలోని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, నాయకులు గాజుల చంద్రకిరణ్, గోనే రాజేందర్, దేవి సాయికృష్ణ, కుర్మ దినేష్, కంది క్రాంతిని వారి వారి ఇండ్లలో రామకృష్ణాపూర్ పోలీసులు..,
మందమర్రిలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఎండీ ముస్తఫా, పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి నవీన్, ఎండీ తాజ్‌ను.., చెన్నూర్ పట్టణంలో ని బస్టాండ్‌లో బీఆర్ఎస్వీ నాయకులు నయా బ్, ఎనగందుల ప్రశాంత్, తిరుపతి, సురేశ్, మనోహర్, రేవల్లి రాజును.., సీసీసీ నస్పూర్‌లోని బీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు కాటం రా జు, నాయకులు సాజిద్, వంశీని వారి వారి ఇండ్లలో.., బెజ్జూర్ మండలంలో నాయకులు దుర్గం తిరుపతి, తొడ్షెం శంకర్, నికాడి మోహన్, శంషొద్దీన్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆ నాయకు లు మాట్లాడారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేదని, బీఆర్ఎస్ పా ర్టీ, దాని అనుబంధ సంఘాలు ప్రజల ప క్షాన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం గంపెడు హామీలు ఇచ్చి, బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేపట్టిందని మండిపడ్డారు.