ఉట్నూర్/భైంసా, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్ర నివాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ మహిళా నాయకులు కలిశారు. కేసీఆర్ను కలిసిన వారిలో ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు పడకంటి రమాదేవి, ఉట్నూర్ మాజీ ఎంపీటీసీ రాథోడ్ చారులత, తదితరులున్నారు.
అనంతరం ఈ నెల 27న వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రజతోత్సవ సభ నిర్వహణపై మహిళా నాయకురాళ్లతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభకు సన్నాహకంపై నాయకురాళ్లకు ఆయన పలు సూచనలు చేశారు.