ఇచ్చోడ, అక్టోబర్ 14 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని అడేగామ(బీ) గ్రా మంలో శనివారం పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అనంతరం జల్దా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘ నంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో నిరుపేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
మల్లికార్జున స్వామికి పూజలు..
మండలంలోని సిరిచెల్మ గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామివారికి బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాండురంగ్, మండల మాజీ కన్వీనర్ మేరాజ్, సర్పంచ్ సునీత సుభాష్, మాజీ జడ్పీటీసీ కృష్ణకుమార్, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, ఏపీసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు శివ రెడ్డి, గాడ్గె సుభాష్, అబ్దుల్ శాబీర్, రమేశ్, విజయ్, లక్ష్మి, పాండు, మహేందర్ రెడ్డి, అజీమ్, ఫరీద్, మతీన్, మైముద్, రవీందర్, సుభాష్, గణేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి సీఎంగా గెలిచి రికార్డు సృష్టిస్తారని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని తాంసి (బీ) గ్రామానికి చెందిన సర్పంచ్, మహిళా సం ఘాల సభ్యులు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని, అందుకే మరోసారి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్, రజినీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఆశన్న, మహిళా సంఘాలు పాల్గొన్నారు.