BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
BRS | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలాన్ని కరువు మండలంగా ( Drought mandal ) ప్రకటించాలని బీఆర్ఎస్ ( BRS ) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్ భవనంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య ( Sattaiah ) అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాసిపేట మండలం ఏజెన్సీ ప్రాంత పరిధిలో ఉండటంతో పాటు అధిక సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్నారని, ఇలాంటి ప్రాంతాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం సరికాదని పేర్కొన్నారు.
కరువు మండలాల ఎంపికకు ప్రభుత్వం అనుసరించిన ప్రమాణాలేమిటో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా 11 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గం లో నెన్నెల, వేమనపల్లి మండలాలను మాత్రమే ఎంపిక చేశారని, కాసిపేటతో పాటు మిగిలిన మండలాలను విస్మరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే స్పందించి, మండలానికి జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కాసిపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, బెల్లంపల్లి నియోజకవర్గంలోని అర్హత కలిగిన అన్ని మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కాసిపేట మేజర్ పంచాయతీ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, బీఆర్ఎస్ మండల కార్యదర్శి మోటూరి వేణు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటెంకి వాసుదేవ్, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచంద ర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, నాయకులు లంక లక్ష్మణ్, జాడి రామచందర్, అచ్యుత్ రావు, గోమాస సుధాకర్, దుర్గం రవి, నిచ్చకొల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

