కౌటాల, డిసెంబర్ 16 : పులిదాడిలో గాయపడ్డ రౌతు సురేశ్‌కు రూ. 10 లక్షల పరిహారమివ్వాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడ గ్రామానికి చేరుకొని సురేశ్‌ను పరామర్శించా రు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుం బ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సురేశ్ పేద కు టుంబానికి చెందినవాడని, భూమి కౌలుకు తీసుకొని వేసిన పత్తిని తీసేందుకు వెళ్లినప్పు డు ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. సురేశ్ భార్య ధైర్య సాహసాలు గొప్పవన్నారు. సురేశ్ ఇంటిలో కనీసం విద్యు త్ బల్బు కూడా లేదని, బీఆర్ఎస్ నాయకులే ట్యూబ్ లైట్లు తెచ్చి పెట్టారన్నారు. మా పార్టీ చీకటిలో ఉన్న పేదలకు వెలుగునిచ్చే పార్టీ అన్నారు.
సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి
కౌటాల మండల కేంద్రంలో గ్రామ స్థాయి సోషల్ మీడియా సభ్యులతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కారులో చేపట్టిన అభివృద్ధి, నేడు గ్రామ స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా వివరించాలన్నారు. నియోజక వర్గంలో ఆయన కృషితో సంతూర్ స్కాలర్షిప్లు ఇప్పించినట్లు తెలిపారు. మనం చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట నియోజక వర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, సిర్పూర్, కౌటాల మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
బెజ్జూర్, డిసెంబర్ 16 : మండలంలోని పాపన్‌పేట, మర్తిడి గ్రామాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన భోనాల వేడుకల్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక భోనాల వేడుకలని పేర్కొన్నారు. మర్తిడి గ్రామానికి చెందిన గొల్లపల్లి సత్యనారాయణ సీఆర్పీఎఫ్ ఉద్యోగం సాధించగా, అతడిని శాలువాతో సన్మానించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బూస సారయ్య, దుర్గం తిరుపతి, ఖాజామోహినుద్దీన్, సలీం, సూర్ల ఇస్తారి, నికాడి మోహన్ తదితరులున్నారు.