బెజ్జూర్, జనవరి 8 : గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు చదువుతో పాటు క్రీడల్లోనూ రా ణించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం మారుమూల గ్రామం పాపన్పేటలో యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ జిల్లా కో కన్వీనర్ కొండా రాంప్రసాద్, సీనియర్ నాయకుడు ఖాఖా మోహినుద్దీన్, నాయకులు సలీం, రాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బూస సారయ్య, నాయకు లు రౌతు బాపురావ్, దుర్గం తిరుపతి, సప్తగి రి, బుజాడి సుధాకర్, దన్నారి శ్రీకాంత్, శశికిరణ్, ఆత్రం వెంకటేశ్, హరీశ్ పాల్గొన్నారు.
రవీంద్రనగర్‌లో..
చింతలమానేపల్లి, జనవరి 8 : రవీంద్రనగర్-1 ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువకులు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. యువ త వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు శివ బిస్వాస్, అనుపమ్ దాస్, దీపక్ గోల్దార్, హరిదాస్ మండల్, సంపత్, సుమిత్, బాల, ఆదిత్యదాస్, రాకేశ్, మోహన్, మండల్, అశోక్ మండల్, ప్రభాకర్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
కన్నెపల్లి, జనవరి 7 : సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కన్నెపల్లి, అయితపల్లి, సాలిగాం గ్రామాలను సందర్శించారు. ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ సాలిగాం గ్రామం నుంచి నాయకునిపేట వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, నల్లవాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. సాలిగాం గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని కోరారు. సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.