కాగజ్‌నగర్, అక్టోబర్ 9 : బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్యేనని, ఆ వర్గాలకు న్యా యం చేయగలిగే పార్టీ తమదేనని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం తెచ్చిన జీవో-9పై రాష్ట్ర హై కోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యే క్రమంలో బీసీల నోటి కాడి కూడు ఆధిపత్య వర్గాలు లాకున్నాయన్నారు.
రాష్ట్ర గవర్నర్ ఆరు నెలలుగా ఈ జీవోకు ఎందుకు ఆమోదం తెలుపలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలంతా ఓట్లేసి గెలిపించిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ బిల్లు విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు.42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలైతే సిర్పూర్లో చాలా మంది బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఏళ్ల తరబడి ఇకడికి వలస వచ్చి ఈ ప్రాంతాన్ని దోచుకుంటున్న వారి ఆగడాలు ఆగిపోయేవన్నారు. నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాం రావు, ఉద్యమకారులు కొంగ సత్యనారాయణ, నాయకులు సలీం, మిన్హాజ్, గోలెం వెంకటేశ్, షాకీర్, పోషం, అతియా, లహెంచు పాల్గొన్నారు.
100 మంది చేరిక
బెజ్జూర్, అక్టోబర్ 9 : స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చా రు. గురువారం బెజ్జూర్ మండల కేంద్రం లో ఆయన సమక్షంలో ఏటిగూడ, ముంజంపల్లి, కుశ్నపల్లి, చింత లమానేపల్లి మండలం దిందా, గూడెం గ్రామాల కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 100 మం ది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అర్షద్ హుస్సేన్, సారయ్య, ఖాజామోహినుద్దీన్, సోయం చిన్నయ్య, తిరుపతి, దేవయ్య పాల్గొన్నారు.