మంచిర్యాలటౌన్ : బీఆర్ఎస్ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ. 4 కోట్లతో నిర్మించిన జంక్షన్లను ( Junctions) నిరసిస్తూ సోమవారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకోను (BRS Protest ) నిర్వహించారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీ టాకీస్ చౌరస్తా వరకు నిర్మించిన నాలుగు జంక్షన్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది.అయితే వీటిని కుదించడం కోసం చేపట్టిన కూల్చివేతలను నిరసనగా చేపట్టిన రాస్తారోకో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పక్కకు తప్పించే క్రమంలో సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ లక్ష్మణ్ బీఆర్ఎస్ నాయకుడు విజిత్ రావును గట్టిగా లాగేసే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్ను ప్రశ్నించడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాస్తారోకో వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో బీఆర్ఎస్ శ్రేణులను బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు .