చెన్నూర్, మే 20 : తమ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని బీ ఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రా జా రమేశ్ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత ల దాడిలో గాయపడ్డ సుద్దాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రాజబాపు, కాచన్పల్లికి చెంది న కార్యకర్త కందుగుల విజయ్ మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతుండ గా, సోమవారం ఆయన పరామర్శించారు.
ధైర్యం చెప్పి, వైద్యం కోసం ఆర్థిక సాయమందించారు. కాంగ్రెస్ నేతలు రాజబాబు, విజ య్ కుటుంబ సభ్యులపైనా దాడి చేయడం దారుణమని ఖండించారు. ఈ కార్యక్రమం లో చెన్నూర్ ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు రవి, ప్రభాకర్, హరీశ్, శివ, సాయి పాల్గొన్నారు.