భీమారం, జూలై 15: కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్-2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్ -1 మెయిన్‌కు 1: 100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో సోమవారం రాష్ట్ర సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు.
ముట్టడికి వెళ్లనీయకుండా భీమారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు వేముల ప్రణీత్ గౌడ్, సోషల్ మీడియా మండల ఇన్చార్జి వీరగోని రమేశ్ గౌడ్, యువ నాయకుడు దాసరి మణిదీపక్, బీజేపీ నాయకులు కొమ్ము కుమార్‌యాదవ్, వేల్పుల రాజేశ్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.