మంచిర్యాలటౌన్, నవంబర్ 9 : ‘మూసీకి అడ్డొస్తే ముక్క లు చేస్తాం.. బుల్డోజర్లతో తొక్కిస్తాం’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు శనివారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టింది. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భం గా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడు తూ అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా చేపట్టిన పాదయాత్రలో కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని, ఈ వ్యాఖ్యలను యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం సరికాదని, అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. మరో నాలుగేళ్లలో బీఆర్ఎస్ గద్దెనెక్కడం ఖాయమని, అ ప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం మరచి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదోఒకటి మాట్లాడుతున్నారని మండిపడ్డా రు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజ లు సిద్ధంగా ఉన్నారని, ఆచరణ సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు గాదెసత్యం, గోగుల రవీందర్‌రెడ్డి, తోట తిరుపతి, అంకం నరేశ్, ఎర్రం తిరుపతి, సత్తయ్య, పడాల శ్రీనివాస్, సత్యం, తాజుద్దీన్ , పల్లపు రాజు , శంకర్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, నవంబర్ 9 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేదర్చౌక్ వద్ద ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఆందోళన చేపట్టారు. రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో కోట్లు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ఆపే ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం దారుణమన్నారు. కేసీఆర్ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అని, అంతటి వ్యక్తిని కించపరచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, నాయకులు హైమద్, నిస్సార్, శ్రీనివాస్, భీమేశ్, నారాయణ, బలరామ్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్, మంత్రి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
కాగజ్‌నగర్, నవంబర్ 9 : బీఆర్స్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మిన్హాజ్, పార్టీ నాయకులు నక మనోహర్, ముస్తఫిజ్, సలీం, తన్నీరు పోచం, శోభన్, అంజయ్య, చరణ్ దాస్, సత్యం, రాగులయ్య, సద్దాం, ఆరీఫ్, హబీబ్ పాల్గొన్నారు.