భీంపూర్, ఆగస్టు 19 : వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ‘నేనున్నా.. ధైర్యంగా ఉండండని’ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. భీంపూర్ సరిహద్దున గల మహారాష్ట్ర సమీపంలో ఉన్న టేకిడిరాంపూర్, గుబిడి, కొజ్జన్గూడ, కరన్వాడి, కరంజి(టి), గోముత్రి, అంతర్గాం, అర్లి, వడూర్, ధనోరా, భీంపూర్, నిపాని, పిప్పల్‌కోటి గామాల్లో నీట మునిగిన పత్తి, కంది పంటలను పరిశీలించారు. మంగళవారం ఉదయం బైక్‌పై వెళ్లి సాయంత్రం వరకు వర్షానికి పంట దెబ్బతిన్న రైతులతో మాట్లాడాడు. కాలినడకన 60 చేలను పరిశీలించాడు. అలాగే టేకిడిరాంపూర్, నిపాని వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిలు, ధనోరా వాగు పరిస్థితి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అతివృష్టితో వేలాది ఎకరాలల్లో పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి బాధిత రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. పార్టీ పరంగా ఒత్తిడి తెస్తామని, అసెంబ్లీలో కూడా చర్చిస్తామని హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు జి. నరేందర్‌యాదవ్, ఆకటి నరేందర్‌రెడ్డి, కల్చాప్యాదవ్, న్యాయవాది కేమ శ్రీకాంత్, నాయకులు బక్కి కపిల్యాదవ్, గుండావార్ ప్రకాశ్, అనిల్, సంతోష్, నితిన్, లస్మన్న, కేమ గంగయ్య, జహూర్అహ్మద్, సతీష్, కునార్పు అశోక్, సంజీవ్‌రెడ్డి, నాగారెడ్డి, గంగారాం, అప్రోజ్, ప్రవీణ్, రైతులు ఉన్నారు.
తాంసి, ఆగస్టు 19 : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ సరార్ నష్ట పరిహారం అందించకుంటే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. కప్పర్ల శివారులో వర్షానికి దెబ్బతిన్న పంటలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌడాల మహేందర్, కప్పర్ల రైతులు బొల్లి నారాయణ, బొల్లి సంతోష్, మునిగేల లక్ష్మీ నర్సింహ, మానే మనోహర్ పాల్గొన్నారు.
భీంపూర్, ఆగస్టు 19 : భీంపూర్ మండల సరిహద్దులో గల గుబిడి, గోముత్రి, అంతర్గాం, అర్లి, వడూర్, గొల్లగడ్, తాంసి(కె) గ్రామాల ప్రజలు వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. అంతర్గాం వద్ద పెన్‌గంగ ఉధృతిని పరిశీలించారు. నాటు పడవలో మహారాష్ట్రకు వెళ్లవద్దని సూచించారు. ఎమ్మెల్యేతో నాయకులు ప్రకాశ్, కపిల్, అశోక్ ఉన్నారు.