బోథ్, నవంబర్ 14 : అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. బోథ్ మండలంలోని మర్లపల్లిలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన ఇందుర్ మల్లేశ్ కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించారు. అగ్ని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయంగా రూ.10 వేలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ ఆర్.సంధ్యారాణి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సురేందర్ యాదవ్, డాక్టర్ స్వామి, ప్రవీణ్, ఎల్క రాజు, వెంకటరమణ గౌడ్, రూప్చందర్, శ్రీధర్ రెడ్డి ఉన్నారు.
భీంపూర్, నవంబర్ 14: భీంపూర్ మండలం పిప్పల్‌కోటి మాజీ సర్పంచ్ కేమ గంగయ్య మాతృమూర్తి, బీఆర్ఎస్ నాయకుడు నాగరెడ్డి మాతృమూర్తి, నిపాని గ్రామంలో నాయకుడు రాంరెడ్డి అత్తమ్మ ఇటీవల మృతిచెందారు. శుక్రవారం వారి కుటుంబీకులను ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నాగయ్య, గడ్డం లస్మన్న, కేమ గంగయ్య, జీ నరేందర్‌యాదవ్, కేమ శ్రీకాంత్, ఎం.కల్చాప్యాదవ్, అనిల్, కరుణాకర్ రెడ్డి తదితరులున్నారు.