బోథ్, ఆగస్టు 29 : బోథ్ నియోజకవర్గం పరిధిలోని ధన్నూర్(బీ) వాగుపై వంతెన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా రోడ్డు, భవనాల శాఖ అధికారులు చొరవ చూపాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. శుక్రవారం దెబ్బతిన్న వాగు వంతెనను పరిశీలించారు. సంబంధిత శాఖాధికారులతో ఫోన్లో మాట్లాడారు. వంతెన నిర్మించాలని సూచించారు.
అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వంతెన నిర్మాణంతోపాటు అసంపూర్తిగా ఉన్న అడెల్లి రోడ్డు పనులు కూడా ప్రారంభించేలా చూస్తామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.
అనంతరం బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ ఇటీవల కంటి శాస్త్ర చికిత్స చేయించుకోగా ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. బోథ్ వీడీసీ మాజీ అధ్యక్షుడు గట్ల గంగాధర్ గురువారం మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ధన్నూర్(బీ)కి చెందిన మునిగెల శైలజ ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబసభ్యులను ఓదార్చారు.
– బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్