తానూర్ : మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానికేతన్ పాఠశాలలో ( Vagdevi School ) శుక్రవారం బోనాల పండుగను (Bonalu festival ) ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ అన్నారు. ఈ పండుగను హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో , రాష్ట్రంలోని ప్రాంతాలలో పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు.
బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు ఇళ్లలో తయారుచేసిన నైవేద్యాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా దేవాలయాలకు వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అరవింద్ రెడ్డి, కరెస్పాండెంట్ అవినాష్, ప్రిన్సిపల్ ఉషా కిరణ్మై, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.