తాండూర్, ఫిబ్రవరి 12 : బెల్లంపల్లి స్కై జిమ్ ఆధ్వర్యంలో ఈ నెల 26న బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్లో నిర్వహించనున్న తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీల (మిస్టర్ ఐరన్ మ్యాన్-2023)కు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం తాండూర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ కే జగదీశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి మిస్టర్ ఐరన్ మ్యాన్ టైటిల్‌తో పాటు మిస్టర్ ఆదిలాబాద్ జిల్లా టైటిల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మిస్టర్ ఐరన్ మ్యాన్‌కు రూ.50 వేలు, మిస్టర్ ఆదిలాబాద్‌కు రూ.15 వేలు అందజేయడంతో పాటు గోల్డ్ మెడల్ విజేతకు రూ. 5 వేలు, సిల్వర్ మెడల్ విజేతకు రూ. 4 వేలు, బ్రాంజ్ మెడల్ విజేతకు రూ. 3 వేలు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి గడప రాకేశ్, బెల్లంపల్లి కార్యదర్శి పన్నాల సదానందం, బెల్లంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రేవెళ్లి విజయ్‌కుమార్, స్కై జిమ్ నిర్వాహకులు సిర్ర బాలకృష్ణ, జంబోజు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.