కడెం : నిర్మల్ జిల్లా కడెం( Kadem) మండలం లింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం రక్తదాన శిబిరాన్ని (Blood donation) ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుర్ర గంగాధర్ (డజ్జు యాదవ్) తల్లి కుర్ర లచవ్వ జ్ఞాపకార్ధం ఫౌండేషన్ ఏర్పాటు చేసి రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రికి చెందిన సిబ్బంది ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించగా, రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.