Adilabad | బజార్ హత్నూర్ : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికే బ్లీచింగ్ పౌడర్ సంచులు పరిమితం అయ్యాయి. ఈ నెల 5వ తేదీన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి బ్లీచింగ్ పౌడర్ సంచులు రాగ ఇప్పటి వరకు వాటిని గ్రామ పంచాయతీలకు చేర్చలేదు. దీంతో ఆయా గ్రామపంచాయతీల పరిధిల్లో అపరిశుభ్రత నెలకొంది. అపరిశుభ్రత కారణంగా గ్రామాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వర్షాలు కురియడంతో.. మురికి కాలువలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఎంపీడీఓ శ్రీనివాస్ ఈ సంచుల మధ్యనే వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ గ్రామపంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ సంచులు చేరడం లేదనే దృష్టి పెట్టక పోవడం విడ్డూరంగా ఉంది.