జైనథ్, మే 20 : రాష్ట్రం ఏర్పడ్డాకే గ్రామాల్లో చకచకా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తన స్వగ్రామమైన దీపాయిగూడలో రూ.20 లక్షలతో బస్ షెల్టర్, రూ.15 లక్షలతో రీడింగ్ రూం నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాతే తన సొంత గ్రామం దీపాయిగూడలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. సవారీ బంగ్లా నిర్మాణంతోపాటు రామ మందిరం కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. మరో రూ.50 లక్షలు ఎమ్మెల్యే నిధులను ఖర్చు చేసి అన్ని సౌకర్యాలతో మందిరాన్ని నిర్మిస్తామన్నారు. యూత్ భవనంతోపాటు ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు.
ఫోన్ చేస్తే చాలు.. స్పందిస్తా..
దీపాయిగూడ గ్రామస్తులు ఫోన్ చేస్తే చాలు.. అభివృద్ధి పనులపై స్పందిస్తానన్నారు. ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తామన్నారు. వర్షాకాలంలో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు పానాదులను సైతం నిర్మిస్తామస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ల్రైబరీ చైర్మన్ మనోహర్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, తహసీల్దార్ రాఘువేంద్రరావు, ఎంపీడీవో గజానన్‌రావు, సర్పంచ్ బొల్ల గంగన్న, ఎంపీటీసీ కరుణాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు పోతారెడ్డి , రామానంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రంఖంలో కుమ్రం భీం విగ్రహావిష్కరణ
బేల, మే 20 : బేల మండలంలోని పొనాల గ్రామపంచాయతీ పరిధిలోని రంఖం గ్రామంలో ఎమ్మెల్యే జోగు రామన్న కుమ్రం భీం విగ్రహాన్ని మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. వందేండ్లలో జరగని అభివృద్ధిని పదేండ్లలోనే చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రజలు బీజేపీ కుట్రలను గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలను భద్రపరుస్తూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో ఆదివాసీ భవన్ ఏర్పాటు చేసి చరిత్రలో గుర్తుండిపోయేలా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను ఆదివాసీ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ఠాక్రే, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కళ్యాం ప్రమోద్ రెడ్డి, బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు సతీశ్ పవార్, దేవన్న, బండి సుదర్శన్, వారాడే విఠల్, ఠాక్రే తాన్బా, విఠల్ రావుత్, అవినాశ్, పోహర్ సర్పంచ్ ఆడే శంకర్, ఎంపీటీసీలు కొడప అరుణ్, సకారాం, ఆదివాసీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.