ఎదులాపురం, జూన్ 19 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భీం ఆర్మీ కార్యవర్గాన్ని పటిష్టం చేయాలని భీం ఆర్మీ సంవిదాన్ రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ నిమస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆదిలాబాద్లో దుర్గం ట్రస్ట్ కార్యాలయంలో చైర్మన్ దుర్గం శేఖర్ నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భీం ఆర్మీ సంవిదాన్ రక్షక్ దళ్ రాష్ట్ర, జిల్లా నాయకులు వివిధ అంశాలపై చర్చించారు. అలాగే జిల్లాలో భీం ఆర్మీ కార్యవర్గం నియామకానికి సంబంధించిన అంశాలతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ నిమస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు. అనంతరం దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భీం ఆర్మీని జిల్లాలో పటిష్టపరిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఆంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న భీం ఆర్మీకి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం దుర్గం ట్రస్ట్ చేపడుతున్న సేవలను గుర్తించి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో భీం ఆర్మీ సంవిదాన్ రక్షక్ జాతీయ ఉపాధ్యక్షుడు భూషణ్ దేవగడే, రాష్ట్ర కార్యదర్శి దళిత్ దయ్ కాంబ్లే, విక్కిరౌత్, విభాంషు పాటిల్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాబా సాహెబ్ కాంబ్లే, రమాబాయి మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు శోభతాయి తుల్జాపురే, తదితరులు పాల్గొన్నారు.