భైంసా : భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో త్రిపుర గవర్నర్ (Tripura Governor) నల్ల ఇంద్రసేనారెడ్డిని ఎమ్మెల్యే రామారావు పటేల్ ( MLA Ramarao Patel ) పూలమాల, శాలువతో సన్మానించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్( Hegdewar ) జన్మించిన నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో గవర్నర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న స్మృతి వనం పనులను పరిశీలించారు. అనంతరం ఆయన భైంసాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన గవర్నర్ను సన్మానించారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నాయకులు రమేష్ పండిత్, రావుల పోశెట్టి తదితరులు ఉన్నారు.