వాంకిడి : తెలంగాణలోని దళిత సమాజం భాగ్యరెడ్డి వర్మను ( Bhagyareddy Varma) ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ బౌద్ధమహసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్ (Ashok Mahulkar ) అన్నారు. బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్లో ( Budda Vihar ) నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతిలో మాట్లాడారు. 1888 లో జన్మించిన భాగ్యరెడ్డి వర్మ తన జీవితకాలమంతా దళిత సమాజ అభివృద్ధి కోసం పోరాడారని అన్నారు.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల అంటరా నితనం నిర్మూలన కోసం పట్టుబట్టి 36 సంవత్సరాలు నిరంతర పోరాటం చేశారని, అదే క్రమంలో దళిత విద్యార్థుల కోసం అనేక పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించారని కొనియాడారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అనేక పోరాటాలు చేసిన మహానుభావుడు భాగ్యరెడ్డి వర్మ అని పేర్కొన్నారు. తెలంగాణలో బౌద్ధం వ్యాప్తి, అంటరానితనం నిర్మూలన, దళితుల్లో విద్యాభివృద్ధి, బాల్యవివాహాలు వంటి సమస్యలపై నిరంతర పోరాటం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఆర్గనైజర్ విజయ్, డీవీఎంసీ మాజీ నాయకులు శ్యామ్ రావు దొండుని దుర్గె, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రోషన్ ఉప్రే, అంబేద్కర్ , బౌద్ద సంఘం నాయకులు దుర్గం శ్యామ్ రావు లాహుజీ, బలవంత ఉప్రే, మహేష్ కొయ్యాల, మారుతి, శివాజీ, దుర్గం సంతోష్, నూత న్, రమేష్, బాలాజీ, యోగు, అన్నారావు, లడ్డు, తదితరులుపాల్గొన్నారు.