ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లాల్లో పదవ తరగతి (Tenth Class) పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు (Results) సాధించాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి (RJD Satyanarayana Reddy) అన్నారు. సోమవారం స్థానిక రాజేంద్ర ప్రసాద్ బీఏడ్ కళాశాలలో డీఈవో గమన్యూయల్ అధ్యక్షతన మండల విద్యా శాఖ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధికంగా 10 జీపీఏ సాధించేలా కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని నలుగురు కో ఆర్డినేటర్లు (Coordinators) పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలని ఆదేశించారు.
ప్రధానోపాధ్యాయులు (Head Masters) ఎప్పటికప్పుడు సమిక్షిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ , ప్రభుత్వ పరీక్షల అధికారి ఉదయ్ బాబు, ఫైనాన్స్ అకౌంటెంట్ అధికారి దేవాజి, కో ఆర్డినేటర్ మధుకర్, అబిద్ అలి, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.