ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉండేవి. సమైక్య పాలకులు తెలంగాణపై చూపిన వివక్ష ఫలితంగా ప్రజలు ఉపాధి కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రజల ఉపాధిని మెరుగుపర్చడానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నది. ఫలితంగా ఎనిమిదిన్నరేళ్లలో సగటు ఆదాయం బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టీఎస్డీపీఎస్) 2020-21 సంవత్సరానికి గాను జిల్లాలవారీగా తలసరి ఆదాయాన్ని ప్రకటించింది. ఇందులో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలవారీగా చూస్తే తలసరి ఆదాయం బాగా పెరిగింది.
– ఆదిలాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబరు 13 (నమస్తే తెలంగా ణ): ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం కా రణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వ చ్చింది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక ఆర్థి క పరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక రా ష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా వ్యా ప్తంగా ప్రజల ఆదాయం కూడా పెరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.
సరికొత్త పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నది. దీంతో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి రంగాలకు ఐటీ పరిశ్రమలు విస్తరించాయి. జిల్లాకు చెందిన యువత ఐటీ ఉద్యోగాలు చేస్తూ వివిధ దేశాల కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ధరణి లాంటి పథకాల ద్వారా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు సాఫీగా జరుగుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆస రా పింఛన్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, రూ.1 కిలో బి య్యం, వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాల కు మూడెకరాల భూమి పంపిణీ, దళితబంధు లాం టి పథకాలు ప్రజల ఉపాధిని ఎంతో ఎంతో మెరుగుపర్చాయి.
గతంలో గ్రామాల్లో ప్రజలు వైద్యం, తమ పిల్లల ఉన్నత చదువుల కోసం అప్పులు చే యాల్సిన పరిస్థితి. సర్కారు సంక్షేమ పథకాల ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో ఈ ఇబ్బందులు తప్పాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహా య, సహకారాలు అందించకున్నా, రాష్ర్టానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకున్నా సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది.
నిర్మల్ జిల్లాలో రూ.1.79 లక్షలు
సగటున ఒక వ్యక్తి పొందే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం ( టీఎస్డీపీఎస్) జిల్లాల వారీ గా 2020-21 నివేదికలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల తలసరి ఆదాయం బాగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి తలసరి ఆదాయం రూ. 1.75 లక్షల ఉండగా, నిర్మల్ జిల్లాలో రూ.1.79 లక్షలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.1.37 లక్షలు, మంచిర్యాల జి ల్లాలో రూ.1.55 లక్షలుగా ఉంది.
ఆదిలాబాద్లో సైతం ఐటీ కంపెనీ ఉండడంతో జిల్లాకు చెందిన యు వకులు ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సై తం ఐటీ రంగం విస్తరించే అవకాశాలున్నాయి. నూ తన పారిశ్రామిక విధానం వల్ల ఇతర పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిత వేత్తలు ఆసక్తి చూపుతున్నా రు. దీంతో రాబోయే రోజుల్లో జిల్లా ప్రజలకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. గతంలో ఉపాధి కోసం గల్ఫ్దేశాలు, పట్టణాలకు వలసలు పో యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉన్న ఊళ్ల లో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు.
జీవనప్రమాణాల మెరుగు కోసం..
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంస్థల ఆదాయం పెరగడంతో తలసరి ఆదాయం పెరిగింది. గ తంలో ఉన్న ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆసరా పింఛన్లు, దళితబంధు, కల్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాల కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో జిల్లా తలసరి ఆదాయం మెరుగైన దశలో ఉంది.
– కే. రమేశ్, ఉస్మానియా డాక్టరేట్ (ఆర్థశాస్త్రం)