కుభీర్ : జిల్లా కేంద్రంలోని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ నిర్మల్ ఆధ్వర్యంలో కరాటే ట్రైనింగ్ ( Karate Training) , బెల్ట్ గ్రేడింగ్( Belt Grading) పరీక్షలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని చాణక్య పాఠశాల విద్యార్థులతో పాటు వివిధ జిల్లాల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
అసోసియేషన్ ఇండియా చీఫ్ సెన్సాయీ రాపోలు సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా కరాటే పరీక్షకులు సెన్సాయీ తేజసింగ్ భాటియా ఆధ్వర్యంలో జపాన్ కరాటే, షోటోకన్ బెల్ట్స్ గ్రేడింగ్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో చాణక్య సంస్కృతి పాఠశాల నుంచి 11 మంది క్రీడాకారులు పి.ఆధ్య , టి.శ్రీనిధి , డి. రాణవిత, జె.ఆరుష్, టి.మధుప్రియ, పి.ఆకర్ష్ , టి.హరీష్ సింగ్,యస్. సవిధన్ , పి. మనిదీప్ , జి. నీక్షిత్, పి. సహస్ర జూనియర్ రెడ్ అండ్ ఎల్లో బెల్ట్ సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ పి.సతీష్, జె. శ్రావణ్, ప్రిన్సిపల్ పి.నరేష్, కరాటే కోచ్ ప్రతీక్ష తెలిపారు.