బేల, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బేల ఎంపీపీ వనితాఠాక్రే, జడ్పీటీసీ అక్షిత పవార్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ దవాఖాన, పోనాల, పలు గ్రామాల్లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలో ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం పోనాల, బేల పీహెచ్సీ, మండల పరిషత్ కార్యాలయంలో మహిళలు కేక్ కట్ చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో బేల సర్పంచ్ ఇంద్రశేఖర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ఠాక్రే, మండలాధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తన్వీర్‌ఖాన్, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, డాక్టర్ వంశీకృష్ణ , ఎంపీడీవో మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, మార్చి 8 : మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో బోథ్ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ శేఖర్‌రెడ్డి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళల హక్కుల గురించి వివరించారు. అనంతరం మహిళలను శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బోథ్ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ శేఖర్ రెడ్డి, కోర్టు జూనియర్ అసిస్టెంట్లు శృతి, స్వరూప, గ్రామ సంఘం అధ్యక్షురాలు శోభారెడ్డి, రికార్డు అసిస్టెంట్ సరస్వతి, న్యాయవాది విజయ్, కానిస్టేబుల్ విజయ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షురాలు జ్యోతి, ఐకేపీ ఏపీఎం మాధవ్, సీసీలు మౌనిక, విజయలక్ష్మి, మహేశ్వరి, గంగాధర్, సీబీవో గంగాధర్, ఐకేపీ ఆపరేటర్ అశోక్, జ్యోతివర్మ, స్వయం సహాయ సంఘం సభ్యులు, అంగన్వాడీ, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
బోథ్, మార్చి 8 : వేదం పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ జయశ్రీ హాజరయ్యారు. మహిళల గురించి సందేశాన్ని తెలిపారు. ఉపాధ్యాయురాళ్లు ఆమెను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, మార్చి 8 : పారిశుధ్య మహిళా కార్మికుల సేవలు మరువలేనివని ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి ప్రశంసించారు. మండల కేంద్రంలోని గోల్డెన్ లీఫ్ పాఠశాల ఆవరణలో సామాజిక కార్యకర్త నిమ్మల సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో మహిళా కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు చేశారని, అలాంటి వారి రుణం తీర్చుకోలేమని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, గోల్డెన్ లీఫ్ కరస్పాండెంట్ మౌనిక, అనిల్, నక్కల రాజేశ్వర్ రెడ్డి, అరుణ్ పాల్గొన్నారు.
నార్నూర్, మార్చి 8 : మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కావల రమేశ్, వైస్‌ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 8 : జిల్లా కేంద్రంలోని దుర్గం ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా కార్మికులను శాలువాలతో సన్మానించి చీరెలు అందజేశారు. ముందుగా వారితో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మార్చి 8: అభివృద్ధికి మార్గదర్శకులు మహిళలని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లతతో పాటు మహిళా వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తగూడలో ఆదివాసీ భారత్ మహాసభ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు పెందూర్ ప్రియాంక, అంజలి, సరోజబాయి, సావిత్రిబాయి, వనిత, లలిత, కమల పాల్గొన్నారు.
ఉట్నూర్, మార్చి 8 : మండల పరిషత్ కార్యాలయంలో దళితశక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పీజీహెచ్ఎం అనితాదేవి, ఆత్రం సుగుణ, వెంకటమ్మ, కృష్ణవేణి, జంగు, విజయ, హెచ్‌కే విజయ, సరోజ, స్వప్న, సుగుణ, పద్మలత, నాగుబాయి, శ్యామల, సంగీత, అర్చన, రమణ, దళితశక్తి నాయకులు అరవింద్, మహేశ్, హరిప్రసాద్, రమేశ్, బండి విజయ్, టీటీఎఫ్ నాయకులు జాదవ్ కపిల్, ఆత్రం భుజంగ్‌రావ్, రాంకిషన్ నాయక్, కుమ్ర శ్రీనివాస్, రంజిత్, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ట్రెజరీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి ఆత్రం ఇందిరను అధికారి శ్యాంసుందర్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సిబ్బంది తరుణ్, అమ్జద్‌ఖాన్ పాల్గొన్నారు.
ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ పావనిని సిబ్బంది, విద్యార్థులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కేశవులు, శ్రీనివాసరావు, వినోద్, లక్ష్మణ్, దినేశ్‌రెడ్డి, తిరుపతి, సాయికృష్ణ పాల్గొన్నారు.
ఎదులాపురం(జైనథ్), మార్చి 8 : జైనథ్‌లోని జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, ఎంపీటీసీలు ఇందిర, తోట రమాను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్థన్, వైస్‌ఎంపీపీ విజయకుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఏవో వివేక్, నాయకులు కరుణాకర్ రెడ్డి, తోట రమేశ్, కోల భోజన్న, లస్మన్న, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మార్చి 8: సమాజంలో మహిళల పాత్ర గొప్పదని ఏటీడబ్ల్యూసీ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంజీగోండ్ నగర్లో మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, పోలీస్ శాఖలో పని చేస్తున్న మహిళలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, మర్సుకోల సరస్వతి, సలాం దేవురావ్, హుస్సేన్రావ్, రాధాబాయి, సుగుణ, రాజమణి, యమున, కౌసల్య, అన్నపూర్ణ, విఠల్‌రావ్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 8 : జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళ ఉద్యోగులు వివిధ పాటలపై నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ ఇమాని, ఎస్ఐ సంధ్యారాణి, సీనియర్ అసిస్టెంట్ పవిత్ర, అధ్యక్షుడు పొచ్చన్న, జనరల్ సెక్రటరీ అరవింద్ పాల్గొన్నారు.
ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్ అండ్ ఎల్టీపీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శైలజను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు అన్నదానం జగదీశ్వర్, టీపీవో సాయికిరణ్, యోగేశ్, వికాస్, బత్తుల శ్రీనివాస్, విజయ్, రాజు, సాయికిరణ్, రాణి, స్వప్న, సరిత పాల్గొన్నారు.
ఉత్తమ సేవలు అందించిన మండల వ్యవసాయాధికారులు గుడిహత్నూర్ ఏంఏవో డీ రేవతి, గాదిగూడ జే దివ్య, గుడిహత్నూర్(తొషం క్లస్టర్) డీ శ్రావణి ఏఈవో, నేరడిగొండ క్లస్టర్ ఏఈవో ఈ సౌజన్య, జైనథ్ నిరలా క్లస్టర్ ఏఈవో సుజాత అలాగే సీనియర్ అసిస్టెంట్ ఏడీఏ ఆదిలాబాద్ పుష్పమాలను బుధవారం కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.