బాసర, జూన్ 17 : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవుల నేపథ్యంలో వేలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
పిల్లలకు అక్షరశ్రీకార పూజలు చేయించారు. మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్‌రావు చౌహన్ సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.