చెన్నూర్ టౌన్ : తెలంగాణ బాపు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచుత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్( Bandi Sanjay) నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ రాజా రమేశ్ ( Raja Ramesh) హెచ్చరించారు. కేసీఆర్కు (KCR) బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పై అనుచిత, అసత్య ఆరోపణలు చేసిన సంజయ్ పై కేసు నమోదు చేయాలని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో కలిసి సోమవారం చెన్నూర్ పోలీస్ స్టేషను లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, మాజీ ప్రజా ప్రతినిధులు మంత్రి బాపు, మోతె తిరుపతి, రేవెల్లి మహేశ్, జోడు శంకర్, శ్రీనివాస్, నాయకులు నాయిని సతీష్, సురేశ్ రెడ్డి, భారతి, రవి, మల్లేష్, కొప్పుల రవీందర్, నాయబ్, సురేశ్, ఆశిష్, జలీల్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.