కేసముద్రం, ఆగస్టు 15 : బెండ రైతులు దిగులు చెందుతున్నారు. మార్కెట్లో బెండకాయకు ధర లేకపోవడం.. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో చేనునే వదిలేస్తున్నారు. మార్కెట్ లో కేజీ బెండకాయకు కనీసం రూ.10 కూడా పలకడం లేదని వాపోతున్నారు. కేసముద్రం మండలం మహ మూద్పట్నం గ్రామానికి చెందిన ఎశబోయిన సారయ్య ఎకరం భూమిలో బెండ పంటను సాగు చేశాడు. ఇప్పటి వరకు విత్తనం, పురుగు మందులు, కలుపు నివారణ వంటి వాటితో కలిపి సుమారు రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి ధర తగ్గడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రోజుకు క్వింటా చొప్పున దిగుబడి వస్తున్నా మార్కెట్లో ధర లేకపోవడంతో తెంపిన కూలీ ఖర్చులు కూడా రావడం లేదని చేనును వదిలేశాడు.