మంచిర్యాల, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా శనివారం 20 మంది ఐఏఎస్లు బదిలీలయ్యారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్గా ఉన్న బదావత్ సంతోష్ నాగర్కర్నూల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. నాగర్కర్నూల్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఉన్న కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీఅయ్యారు. ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా పని చేస్తున్న అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లా కలెక్టర్గా రానున్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు విడుదల చేశారు.