జైనూర్ : ఆసిఫాబాద్ జిల్లాలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రాం (Babu Jagjivanram) జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జైనూర్ మండల కేంద్రంలో జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగ్జీవన్రాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర క్యాబినెట్ మంత్రిగా( Cabinet Minister) అయన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథ్, మండల సీనియర్ నాయకులు మిశ్రమం అంబాజీరావు,షేక్ అబ్దుల్ ముఖేద్ సుద్దాల శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్లో..
బాబు జగ్జీవన్రాం జయంతిని సిర్పూర్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తొడసం ధర్మరావ్, నాయకులు అర్కా నాగోరావ్, ఆత్రం దౌలత్ రావ్, కేంద్రే శివాజీ, తదితరులు పాల్గొన్నారు.