ఉట్నూర్, ఆగస్టు18 : గిరిజన రైతుల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని ఐటీడీఏ పీవో బాజ్పాయ్ అన్నారు. స్థానిక కుమ్రంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల అభ్యున్నతికి సీపీఎఫ్ కృషి అభినందనీయమన్నారు. అనంతరం గిరిజన రైతులకు పంటల అధిక దిగుబడి, మొక్కల పెంపకానికి రానున్న రోజుల్లో తీసుకోనున్న చర్యలు, తదితర వాటిపై వివరించారు. రాబోవు రోజుల్లో నిర్వహించనున్న ప్రాజెక్ట్ పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, వివిధ శాఖల అధికారులు, సంస్థ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.