లక్షెట్టిపేట, జూన్ 13 : జాతీయ విద్యా విధానం-2020పై అధ్యాపకులు అవగాహన పెంచుకోవాలని మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ (manu) డీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ వనజ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, విఙ్ఞానం ప్రపంచానికి విశ్వగురువులా వర్ధిల్లుతుందని వివరించారు.
మన దేశంలో చదివిన మేథావులు ఇతర దేశాలకు వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా అధ్యాపకులు పని చేయాలన్నారు. అధ్యాపకులు నూతన విద్యావిధానంలో వచ్చే మార్పులను అవలోకనం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిషన్ ఓజా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ సవిత, ఇంటిగ్రేట్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ పడాల తిరుపతి పాల్గొన్నారు.