తాండూర్ : ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా ( MD Habib Pasha ) అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ( Prajavani ) లో ఆటో కార్మికుల సమస్యలపై ప్రధానమైన పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్‌కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ బోర్డు, పన్నెండు వేల రూపాయలు, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఐదు లక్షల ప్రమాద బీమా వెంటనే మంజూరు చేయాలన్నారు. ఆటో బంద్ పథకం కింద 5 లక్షలు ఇవ్వాలని, ప్రతి పట్టణ, మండల కేంద్రంలో ఒక ఎకరం స్థలంతోపాటు ఆటో భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. పెరిగిన డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలు నియంత్రించాలని కోరారు.
ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల దృష్టి సారించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం శ్రీనివాస్, మండల సలహాదారులు బండి చందు, కోశాధికారి రఫీఖాన్, మీడియా ఇన్చార్జి పుప్పాల శ్రీకాంత్, ప్రచార కార్యదర్శి పోచం, కుమార్, ఏం దుర్గయ్య, షన్ను, రంగయ్య, మొండి, గురుమూర్తి, రాజన్న, అజార్, నవీన్, తాండూర్ మండల ఆటో ఆటో కార్మికులు పాల్గొన్నారు.