కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం లింగి గ్రామ సమీపంలో ఆటో బోల్తా ( Auto Over turn ) పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం భైంసా పట్టణంలో సిమెంట్ ( Cement Bags ) బస్తాలను ఆటోలో కుభీర్ మండలం లింగీ గ్రామానికి తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు కింద బోల్తా పడింది. డ్రైవర్ గంగాధర్( Driver Gangadhar ) కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునే లోపే ప్రమాదం జరుగడం పట్ల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.